Prathyaksha Daivamu    Chapters    Last Page

Kalaprapoorna

Dr. D. Venkatavadhani,

M.A. (Hons.) Ph.D.,

Rtd. Prof. and Head, Telugu Department,

Osmania University, Hyderabad.

I have known Vidwan Sri Panathula Ramesam, M.A., for the last five years. His Knowledge of Telugu Language and Literature is of a high order and he is acquainted with Sanskrit also. He has published several articles in Telugu Magazines and got state first prizes also in two Essay Competitions. He is a good Teacher.

He comes of a respectable family of scholars and possesses good character. He deserves encouragement and I wish him success in his future career.

Hyderabad, (దివాకర్ల వేంకటావధాని)

2-11-1981.

* * *

కళా ప్రపూర్ణ

మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి

లలితా నగర్‌, రాజమండ్రి - 533 105

[శ్రీ శాస్త్రిగారు జగమెరిగిన పండితులు, 'ఆంధ్రపురాణము' వీరి కీర్తికి వైజయంతి. 'ఆంధ్ర రచయితలు' వీరి విమర్శనా పాటవమునకు ప్రతీక.]

శ్రీ పణతుల రామేశ్వర శర్మ ప్రణీతమైన 'ప్రత్యక్ష దైవము'ను కందోయి కద్దుకొని అందలి ప్రశస్త వస్తువునకు ముచ్చట పడి శ్రీపాద శతకమును తత్పరతతో చదివితిని. కతిపయ క్షణములలో నిరతిశయానందమును చవిచూడ గంటిని. శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి పాదులు యావద్భారతమునకును ఆరాధ్య స్థానము.

1967 లో శ్రీ చరణులు చాతుర్మాస్య నెఱపుటకై రాజమహేంద్ర వరము సపరివారముగా దయ చేసిన సందర్భమున నగర పక్షమున శ్రీ వారికి 'స్వాగతోత్పలాంజలి' ఘటించిన భాగధేయము నాకు లభించినది. శ్రీవారి అనుగ్రహాశీస్సునకు పాత్రుడనై 'చాతుర్మాస్యము'లో వారి యభిభాషణములు కొన్ని శ్రవణము చేయు భాగ్యముకూడ చేకూరినది. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి చరణులు ఆదిశంకరులకు ఆమ్రేడిత మూర్తి. శ్రీవారి యను భావములోకోత్తరము.

''ఉత్తముల మహిమ నీటికొలcది తామరచుమ్మీ!'' అన్నట్లు శ్రీవారి మహిమ ప్రకటితమగుచుండును. అస్మద్గోత్రులు శ్రీ పణతులు రామేశ్వర శర్మగారి పురాకృత సుకృతము చాల గొప్పది.

శ్రీపాద శతకములో ప్రతి పద్యము అవిచ్ఛిన్న ధారా శక్తి కలిగి అంతఃకరణ శుద్ధియు దానికి తోడైన కారణమున సదాతనత్వమును స్ఫురణకు తెచ్చుచున్నది. ఈ తెలుగు పద్యములలో తులసీ సౌరభము! బిల్వ దళ పరిమళము! జల జాత సౌగంధ్యము! సువర్ణో జ్జ్వలత! శ్రీస్వామి పాదుల చరణార్చనము గావించుచు శ్రీ శర్మగారు తన జీవితమును కవిత్వమును చరితార్థముచేసికొనుచున్నారు.

(సం) మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి

* * *

డా|| బెజవాడ గోపాలరెడ్డి

శాంతి నికేతన్‌ - నెల్లూరు - 3.

[డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డిగారు (1907) రవీంద్రకవీంద్రుని శిష్యులై శాంతి నికేతమున సారస్వత సంస్కారములను అలవరచుకొన్నారు. 29వ ఏటనే మదరాసు ప్రభుత్వములో మంత్రియై, శాసన సభా నాయకుడుగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఉత్తర ప్రదేశ్‌ గవర్నరుగా నిండైన రాజకీయ జీవితమును అనుభవించిన వారు. ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీకి చిర సాధికార అధ్యక్షులుగా నుండిన వారు. వీరికి రాజకీయము బహిః ప్రాణమైన సారస్వతము అంతః ప్రాణము.]

శ్రీ శర్మగారికి,

మీరు దయతో పంపిన పుస్తక మందినది. శ్రద్ధగా చదివి, కంచి కామకోటి పీఠాధిపతుల వృత్తాంతము తెలిసికొంటిని.

మంచి పీఠికే గాక, పద్యాలు, తాత్పర్యము, ఇంగ్లీషు అనువాదము చదువరులకు చాల ఉపయోగకారిగా నుండగలదు. పెద్ద కార్యమునే పూని, పూర్తి చేసినందులకు అభినందించుచున్నాను.

శ్రీ టంకసాల సత్యనారాయణ గుప్తగారు ఉదార విరాళముతో ప్రోత్సహించుట చాల ఉత్కృష్ట కార్యము. ఈ దానము అందరి భక్తులను ఉత్తేజపరచు గాక.

నెల్లూరు, (సం) బెజవాడ గోపాలరెడ్డి

13-2-87.

* * *

డా|| సి.వి. సుబ్బన్న శతావధాని

M.A., Ph.D.,

ప్రొద్దుటూరు-516 360.

[అవధాన మనగనే శ్రీ సి. వి. సుబ్బన్న శతావధాని గారు ఠక్కున గుర్తునకు వత్తురు. బ్రహ్మశ్రీ గడియారము వారి అనుంగు శిష్యులుగా గోప వధూ కైవల్యము, భోజకువింద చరిత్రము, ధనుర్దాను వంటి చక్కని చిక్కని కావ్య రచనలతో బాటు 'అవధ్యాన విద్యపై' పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టము నందిన లబ్ధ ప్రతిష్ఠులు.]

మా చి. రామేశ్వరశర్మ మా స్వామిపాదుల స్తుతించుట మాకు ఎంతో సంతోషదాయకమైన విషయము.

ఈ కవి 'అష్టావధాని'. అవధానికి ఆశుకవితా సరస్వతి స్వాధీనయై యుండును. పద్య మెత్తికొన్నచో తుదిదాకు దనుక ఆగదు. ఆధార ఆకాశంగంగాధార. పులుముట, వెనుకముందులు చూచుట, శబ్దములు మార్చుట యుండదు. ఆ పని పెట్టుకొన్నచో రచన నిగ్గుదేర వచ్చునేమో కాని, 'ధారణ'కు ఒదిగిరాదు. కనుక అవధాని - 'వెనుకకు రాక చొచ్చు రణవీరుని కైవడి' పరుగిడుచుండును. ఈయన పద్యములయందు పందెపు గుఱ్ఱముల లక్షణము కనబడుచున్నది.

వస్తువు గురు భక్తి. ఈ భక్తి సంసారపు ఱొంపిలో చిక్కి తన్నుకొని చచ్చు వ్యక్తికి ముక్తి యిడు ననెడు విశ్వాసమునకు మూల భూతమైనది. ఈయన చిన్నవాడయ్యు లౌకిక విశేషము లెఱిగిన తొంబదియేండ్ల పండు వలె కనబడుచున్నాడు. ఆముష్యాయణుడైన పుణ్య జీవునకు పూర్వజన్మ వాసన యుండును గదా!

అఖిలభారతాగమ శిల్ప సదస్సులో శ్రీపాదులు నా కనుగ్రహించిన కాశ్మీరరాంకవము ధరించి నేను సభలకు వెళ్ళుచుందును. ఎందఱో పెద్దలు నా యొద్దకు వచ్చి, యీ పేలువకు నమస్కరించి ధన్యత గంటిమని భావించుచున్నారు. కాగా, ఈ గ్రంథమును జూచి యెందఱు మ్రొక్కుదురో యోజింపుడు.

ఫణి శివుని రత్నములతో పూజించినది. ఆ రత్నములను ఱాళ్ళుగా భావించి యేనుగు క్రిందికి ద్రోసినది. గురుచరణ పూజాత్మకమైన యీకృతి అష్టోత్తర శత పద్య రత్న మంజూష. వేత్తలైన పండితుల కివి రత్నములు. వట్టి పురోభాగులకు ఱాళ్ళు.

చి. రామేశ్వరము క్రమముగా శ్రీ మచ్భంకర భగవత్పాదుల కృతులను తెనుగు చేసి, లోకమున కిచ్చి, గుర్వనుగ్రహ పాత్రుడగుతమని హార్దమైన ఆశీర్వచనము.

(సం) డా. సి.వి. సుబ్బన్న శతావధాని

10-2-87

*

డా|| రాజేశ్వరి దివాకర్ల M.A., Ph.D.,

Telugu Professor,

BANGALORE.

[ఈ విదుషీమణి ఆంధ్ర సాహితీ కుంభ సంభవులు పూజ్యశ్రీ దివాకర్ల వేంకటావధానిగారి కుమార్తె. 'ఆంధ్రమున ప్రబంధ రూపము నందిన సంస్కృత నాటకములు' అను విషయముపై డాక్టరేటు పట్టము నందిన వారు. ఈమె భర్త శ్రీ సి. వేంకటయ్యగారు M.Tech. ఇండియన్‌ స్పేస్‌ రిసర్చ్‌ ఆర్గనైజేషన్‌లో ఇంజనీరు- సాహితీ పిపాసి. ఈ సమయమున అవధానిగారు లేని లోటును తీర్చినట్టి సోదరి ఈమె.]

శ్రీ పణతుల రామేశ్వర శర్మగారు రచించిన 'ప్రత్యక్ష దైవము' అద్వైతాన్ని అనుభూతికి తెస్తుంది. తేనెసోనల వంటి తెలుగు పద్యాలలో సరళ##మైన అక్షరాలు కూర్చి అవిరళ##మైన భావాలను అలవోకగా ప్రకటించారు. తను నమ్మిన ప్రత్యక్ష దైవానికి నిండు మనస్సును 'శతక కుసుమంగా' సమర్పించుకోవడం కంటే వేరే కానుక ఏముంటుంది?

స్వామివారి అనుగ్రహాన్ని పడసిన పణతుల రామేశ్వర శర్మగారి వంటి సోదరుని సాహితీ పరిణతకు గర్విస్తూ

రాజేశ్వరి దివాకర్ల.

* * *

సాహిత్య శిరోమణి, విద్వాన్‌

కఱ్ఱా వేంకట సుబ్రహ్మణ్యం, M.A.,

ఆంధ్ర శాఖాధ్యక్షులు, S.D.G.S. కళాశాల,

హిందూ పురం.

[సుప్రసిద్ధ విమర్శకులు, మను చరిత్ర విమర్శనము వీరి కెనలేని కీర్తిని సంపాదించి పెట్టినది. పెద్దన పద్యము - వేటూరి విమర్శ - రాళ్ళపల్లి వచనము మూర్తీభవించినవారు. అబ్రహాం లింకన్‌, లూయీ పాశ్చర్‌ మొ||వి వీరి అనువాద గ్రంథాలు.]

చిరంజీవి రామేశ్వర శర్మకు -

నీవు పంపిన 'ప్రత్యక్ష దైవము' చేరినది. గురుభక్తితో పరిమళించిన పూల బంతుల వంటి నీ పద్యములు చదివి చాలా సంతోషించినాను. పద్యముల నడక తడబాటు లేక తీగవలె సాగినది. చదివిన పద్యమే మఱల చదువవలెనన్న కుతూహలము కలిగినది. పద్యములు చదువు చున్నప్పుడు ఛందో వ్యాకరణాదులను గూర్చిన ఆలోచనయే నా మనస్సునకు తట్టలేదు. అది యొక రచనా కౌశలము. నీకది నీ గురుభక్తి యనుగ్రహించిన వరముగా దలతును. 'ఏమో మీ మహిమా విశేష మది స్వామీ!'...... (పుట-71) అను పద్యము కట్టు నాకెంతో నచ్చినది. కొంత చేయి తిరిగిన రచయితలు మాత్రమే యిట్టి పద్యములు కట్టగలరు. భావము సామాన్యమైనదే అయినను బంధము వల్ల దానికి బింకము వచ్చినది. 'స్వామీ! పండెను మీతపస్సు' (పుట 49) మొ||గు పద్యముల కట్టు కూడా యిటువంటిదే.

శ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర శ్రీ చరణులు సాకార జంగమ పరబ్రహ్మము. వారిపై నీవు మనసు నిలిపితివి. వారి మహిమములు నీ కృతిలో నిబంధించితివి. నీవు ధన్యుడవు. నీ వాక్కు చరితార్థము. శుభాయతివి కమ్ము.

హిందూపురం, కఱ్ఱా వేంకట సుబ్రహ్మణ్యం.

14-2-87

* * *

T. Sreenivasa Rao, M.A., B.T.,

Principal,

Government Junior College,

PUNGANUR.

I have gone through the book ''PRATHYAKSHA DAIVAM'' written by young and enthusiastic Poet Sri Panathula Rameswara Sarma. I feel that he has ventured to depict the life and spiritual power of the greatest living saint of the modern world. The spgntaneous flow of ideas in his poems reveal his Philosophic bent of mind and immense faith in his Holiness Sri Chandrasekharendra Saraswathi Swamiji of Kanchi Kamakoti Peetam, considered to be the Avatar of Lord Siva. I am confident that with the blessings of the Swamiji, Sri Panathula Rameswara Sarma will enrich the Indian Philosophy by his writings.

In these days when poets are facing untold difficulties in publishing their works, I am happy to note that Sri Tankasala Sathyanarayana Gupta, a pious gentleman and staunch devotee of Swamiji has voluntarily undertaken the task of publishing the book. I pray God to bless Sri Tankasala Sathyanarayana Gupta and his family with long life and prosperity.

(Sd.)

T. SREENIVASA RAO.

21-2-87

* * *

K.A. Narasimha Char

15/92, Brahmin Street,

PUNGANUR.

It gives me great pleasure to write my opinion on the work by Sri P. Rameswara Sarma and I try to do so. Sri Ramesam, has brought out the book titled ''Prathyaksha Daivam'' on the great pontiff of Shri Kanchi Kamakoti Peetam H. H. Sree Sree 1008 Chandrasekharendra Saraswathi Swamiji who is literally the great Guru and aptly titled ''Prathyaksha Daivam''. Sri Ramesam is the ardent desciple of Sri Swamijee.

Words fail me to describe the work as it exceeds all my imaginations. All the 108 Stanzas that are broughtout by the author are gems and emits fine fragrance as lotus, jasmine, Sri Thulasi, Sri Bilva, all stitched together makes a 'Vanamala' adored by Lord Sri Krishna and Sambasiva.

Happy he who reads this book entire, he who has read but the half of it. It makes brahmana wise, the soldier brave, the merchant rich. If, by chance, a slave (Parah) hears it, he becomes ennobled. He who reads this ''Prathyaksha Daivam'' is absolved from all his sins.

While an author should try to explain clearly and interestingly what he knows to his reader, mere clarity of thought and expression will not be sufficient to enable the reader to follow the diseourse on a religious or a philosophical subject like the Vedanta unless he possesses some general background of information on the basic concepts of Hindu religion and Philosophy. Shri P. Ramesam possesses all the qualities more than satisfactory as the work shows.

I am happy that I have been asked to translate the Telugu text into English and I take it as a pride that Shri Ramesam has so kindly given me a chance to do so. I am afraid whether I have really done so to the expectation of Shri Ramesam.

I will be failing in my duty if I do not express my whole-hearted congratulations to Shri P. Ramesam, though he is young and rich in learning.

It may not be out of place when I mention Shri Tankasala Sathyanarayana Gupta, the blessed son of late Shri Tankasala Venkatraya Setty, under whom I had the luck to serve while he was one of the Directors of the loans and sale society in 1950's (Nineteen fifties). Sri Satyanarayana is one of the philonthrophists of Punganur who has met the entire expense to bring out this work. Shri Satyanarayana's life partner Smt. Vasundhara has equally stood as ardent desciple of he husband and all God loving persons.

In conclusion, ''Hats off'' to the author Shri P. Ramesam, Shri S. Gupta and his blessed wife.

(Sd.)

K. A. NARASIMHA CHAR.

* * *

ANDHRA PRADESH OPEN UNIVERSITY

Prof. C. Narayana Reddy,

M.A., Ph.D., D.Lit.

Vice-Chancellor

6-3-645, SOMAJIGUDA,

HYDERABAD-500 482 (A.P.)

Date: 21-2-87

['నన్నయ నుండి నారాయణరెడ్డి దాకా' అన్న నానుడికి మూల భూతులైన వీరిని గురించి ఆంధ్ర లోకానికి తెలియజేయా లనుకోవడం సూర్యునికి దివిటీ పట్టడం లాంటిది. పూజ్యశ్రీ దివాకర్ల వారికి అనుంగు శిష్యులై, ఉత్తమ ఆచార్యులుగా, సుప్రసిద్ధ విమర్శకులుగా, బహు భాషా కోవిదులుగా, ప్రజాకవిగా సకలాంధ్ర జన హృదయ క్షేత్రాలలో శాశ్వత స్థానం సంపాదించుకొన్నవారు.]

శ్రీ రామేశ్వర శర్మగారికి,

మీరు పంపిన ''ప్రత్యక్ష దైవం'' అందుకొన్నాను. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాములపైన తెలుగులో పద్యాలు రాసి వాటికి ఆంగ్లానువాదం కూడా సమకూర్చారు. సంతోషం.

మీ భక్తి భావనను ప్రౌఢ పద్య భరితంగా ఉభయ భాషా స్ఫురితంగా ప్రకటించినందుకు నా అభినందనలు.

మీ

(సం) సి. నారాయణ రెడ్డి.

* * *

మాలతీ చందూర్‌

No-2, Katchery Road,

MADRAS-4.

[సుప్రసిద్ధ రచయిత్రి, ప్రాచ్య పాశ్చాత్య సంస్కృతీ సంప్రదాయాలను క్షుణ్ణంగా జీర్ణించు కొన్నట్టిది. అమర గంగా ప్రవాహం లాగా లెక్కకు మిక్కిలి రచనలు చేస్తూ ఆంధ్ర సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం గావిస్తున్నా వినయ మర్యాదలు రూపు గొన్నట్టిది. ఆడంబరాలను ఏ మాత్రమూ సహించని వీరి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం.]

1919 నుంచి ఈనాటి దాకా తమ జీవితంలో ఒక్కక్షణం గూడా యితరుల దృష్టి నుంచి దాచుకోవలసిన రహస్యం అన్నది లేకుండా డెబ్బయి ఏళ్ళ నుంచీ నియమ నిష్ఠలతో నిర్విరామంగా స్వచ్ఛమైన జీవితం గడుపుతున్న మహా వ్యక్తి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి.

ఒక అమృత హృదయుని, ఒక తేజోరూపుని, ఆధ్యాత్మికానందకారుని ముఖాముఖి చూసినప్పుడు మాటలు రావు.

శ్రీ స్వామివారిని గూర్చి లోకానికి ఇంకా విశదం చేయాలని అనుకొన్న ఈ గ్రంథకర్తకు నా అభినందనలు.

(సం) మాలతీ చందూర్‌,

2-3-87.

* * *

ఉమ్మిటి వీరభద్రం

31, బసవయ్యన్‌ స్ట్రీట్‌, మద్రాసు-21.

[వీరు మధురకవులు, దానికితోడు సహృదయులు - సౌమ్యులే కాక చలనచిత్ర నటులు కూడ. 'వీరభద్ర నీతి' కావ్యమును రచించి స్వయముగా ముద్రింపించి ఉచితముగా లోకమునకుc బంచిన ధన్యజీవులు. అట్టడుగు పేదరికము నుండి స్వయంకృషితో వ్యాపారవేత్తయై 'కృషితోనాస్తి దుర్భిక్షమ్మ'ని నిరూపించినవారు. నా ఈకృతి వెలుగు చూచుటకు అహర్నిశలు శ్రమించిన పరోపకార పరాయణులు.]

సుకవివరా! రామేశ్వర!

సకల జనామోద మైన సచ్చరితంబున్‌

ప్రకటించిన నీ కావ్యము

సుకవుల దీవెనలు వడసి శోభిల్లు నిలన్‌.

కంచి స్వామివారి కమనీయ చరితమ్ము

విపులముగను వ్రాసి వెలువరించి

ఉచితముగను బంచ నుత్సహించితి వయ్య

ఇంతకన్న కీర్తియేది భువిని?

దురిత హరంబగు కార్యము

నెరపిన రామేశవర్య! నీ దగు కృషికిన్‌

చిరతర సుశ్లోక యశము

పరగుత ధరలోన రేయి పవలున్నంతన్‌.

చంద్రశేఖరేంద్ర శారదా స్వామిపై

పద్య పద్యమునను భక్తి పొంగి

కవిత సాగె నెంతొ కమనీయ సుధలతో

సకల జనుల కెల్ల సమ్మతముగ.

ముక్తి ఫలము లట్లు ముద్దు ముద్దుగc దోచు

చదువ చదువ రుచులు నొదవు మదికి

ఇట్టి కావ్య రచన మెంచి చేసిన నీదు

జన్మ ధన్యమయ్యె సత్కవీంద్ర!

శ్రీ అక్షయవైకుంఠ ఏకాదశీ, సదా మీ శ్రేయోభిలాషి,

10-1-1987 ఉమ్మిటి వీరభద్రం.

* * *

మల్లాది పద్మావతి, B.A., B.Ed.,

Mandal Educational Officer,

B. N. Kandriga, SRI KALAHASTHI.

[ఈమె పండిత వంశమునుండి వచ్చిన విదుషీమణి. చేయి తిరిగిన కవయిత్రి. నన్ను కన్నబిడ్డ కన్నమిన్నగా గమనించుటతో, నేనును ఈమెను మాతృమూర్తిగా సంభావించినాను. వీరు సాహిత్యములో బహుముఖ ప్రక్రియలు సాగించుటే కాక శ్రీ వేంకటేశ్వరస్వామివారిపై 108 కీర్తనలను గూడా రచించి జన్మ ధన్యమొనర్చుకొన్నారు.]

చి|| రామేశమునకు,

నాయనా! నీ పుస్తకమును జూచి ఆనంద పారవశ్యముతో మైమరచిపోయితిని. ఇంత చిన్నవయసులోనే తపోమహితులైన శ్రీ కంచి స్వాములవారి హృదయములో స్థానము సంపాదించుకొన్న నీ సుకృతమును ఏమని చెప్పగలను! ఇంతటి మహా కార్య మొనరించిన శ్రీ సత్యనారాయణ దంపతుల జన్మ ధన్యమైనది.

(సం) మల్లాది. పద్మావతి.

* * *

సాహిత్య శిరోమణి, విద్వాన్‌

డా|| పి. సుబ్బరాఘవయ్య,

Sanskrit Pandit,

B-Z. High School, CHITTOOR.

[స్మిత మధురభాషి, నిగర్వి, నిరాడంబరులు. చిత్తూరులోని సంస్కృతభాషా ప్రచారిణీ సభలో ప్రముఖులు. సంస్కృత సాహిత్యము నాపోశనము వట్టి ఆ దేవభాషా సేవలో జన్మధన్యము చేసికొనుచున్న పుణ్యమూర్తులు.]

మా చిరంజీవిలో నింతటి శక్తి యున్నట్లు నేనెఱుగను. గ్రంథమును జూచినట్లయిన నీతని శ్రమ ఇంతింత కాదని గ్రహింపగలము. శ్రీశ్రీశ్రీ స్వామివారి అనుగ్రహముతో చి|| రామేశము ఉత్తరోత్తర 'మహాకవి' స్థానమలంకరించుగాతమని నా మంగళాశీర్వచనము.

(సం) పి. సుబ్బరాఘవయ్య.

* * *

విద్వాన్‌ ఇ.వి. సుబ్రహ్మణ్యం,

నెం. 11 - కైలాస శెట్టి స్ట్రీట్‌,

మద్రాసు - 21.

[సహోపాధ్యాయులు, స్నేహ శీలి, స్నిగ్ధ హృదయులు, హాస్య ప్రియులునైన వీరిలో కవితా సంస్కారము నివురు గప్పిన నిప్పువలె నున్నది. వీరి 'భిక్షాటనాధీశ్వర' శతకము 'ఆంధ్ర శివానందలహరి' పరికించినచో, కవితలో రక రకముల పోకడలు పోవుటలో వీరికి గల కౌశలము 'ఔరా యనిపించక మానదు. నా యీ కృతి రూపు దిద్దుకొనుటలో నాద్యంతము సూత్రధారులైన వీరికి నేను బడిన యప్పు తీర రానిది.]

ప్రశంస

సీ|| శ్రీ చంద్రశేఖ రాశీర్వాద మహితమ్ము

దివ్యమ్ము భక్త ముక్తి ప్రదమ్ము;

అజ్ఞాన తిమిరాస హరణమ్ము భవ్యమ్ము

వేదాంత సారమ్ము వినుత యశము;

శంకర మత పీఠ సత్కార్య ముకురమ్ము

సకల జనామోద సన్నుతమ్ము:

దురిత సంహారమ్ము వర మౌని హారమ్ము

భారతీ హస్తాబ్జ వర శుకమ్ము;

నైన ప్రత్యక్ష దైవము హైందవాళి

పుణ్యఫల మిద్ది సత్కవి గుణ్యుcడైన

సఖుcడు ఘనుcడు రామేశ్వర శర్మ జన్మ

ధన్యతం గాంచె నీ కృతి తారచించి.

తే||గీ|| అమృత కీర్తి శ్రీ సత్యనారాయణాభి

రక్షితంబై వసుంధరc బ్రణుతి గాంచు

సుకవి లోకరాజ నుతమై సూక్తిల హరిc

దినరు రామేశు ప్రత్యక్ష దైవ సుకృతి.

అక్షయ మకర సంక్రాంతి, (సం)

15-1-87 ఇ. వి. సుబ్రహ్మణ్యం

Prathyaksha Daivamu    Chapters    Last Page